పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. భార్య పక్కనుండగానే మరదలితో సరసాలు

కొత్తగా పెళ్లయిన వధూవరుల రిసెప్షన్ వేడుక జరుగుతోంది. ఇందులో దంపతులిద్దరూ వేదికపై కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక యువతి వచ్చి వారిద్దరి మధ్య కూర్చుంది.
వారి వెనకాలే మరికొందరు కూడా నిల్చుని ఫోటోలు దిగుతున్నారు. ఇలా దంపతుల మధ్యలో అమ్మాయి, వెనుకాల బంధువులు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంతలో యువతి.. తన చేయిని నెమ్మదిగా కిందకు దించి, వరుడి చేతిని టచ్ చేయడం స్టార్ట్ చేసింది. సీక్రెట్‌గా, ఎవరూ చూడటం లేదనుకుని, అతని చేతిని టచ్ చేస్తుంది. అయితే, ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. అమ్మాయి వాలకం ఏదో తేడాగా ఉండటంతో వధువు కూడా ఆమెవైపు కాస్త డిఫరెంట్‌గా చూసింది. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తిట్టిపోస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఇది కామన్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.