Sat. Jun 10th, 2023

నటి పరిస్థితి దారుణం.. అలాంటి ఆరోగ్య సమస్యతో 2 నెలలుగా బెడ్ పైనే

బుల్లితెర నటి శిఖా సింగ్( Shikha Singh ) గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సీరియల్ నాగిన్ సీజన్ 6 ( Naagin Season 6 ).

అయితే గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు రెండు నెలలు గడుస్తున్న కూడా ఇప్పటికీ ఆమె కోలుకోలేకపోతోంది. కాగా శిఖా సింగ్ గతంలో తన అనారోగ్య విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తనకు స్కిన్ అలర్జీ వచ్చిందని, ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ మందులు రాసిచ్చారని, కానీ ఒకటి, రెండు రోజుల్లోనే తన పరిస్థితి మరింత దిగజారినట్లు ఆమె వెల్లడించింది.

వైద్యులు అన్ని పరీక్షలు చేసినా ఏమీ నిర్ధారణ కాలేదని, అంతా బాగానే ఉందని చెప్పారని ఆమె తెలిపింది. అయితే తాను ఏమీ తినలేకపోతున్నానంటూ ఆమె వెల్లడించింది. కేవలం తేలికపాటి ఆహారం, కిచిడి తప్ప ఇంకేమీ తినలేకపోతున్నానని తెలిపింది. కాగా గత నెలలో ఆమె ఆరోగ్యం కొంచెం నయం అయితే, విరామం తీసుకోవాలని అనుకుంది. అనుకున్నట్లుగా ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఫిబ్రవరి 7న తన పుట్టినరోజు అని చెప్పి నైరోబీ ట్రిప్( Nairobi trip ) కి వెళ్లామని తెలిపింది. అయితే బాగానే ఉన్నానని అనుకునేలోపే మళ్ళీ హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. ట్రిప్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి తాను బెడ్ పై ఉంటున్నట్లు ఆమె వెల్లడించింది. తన భర్త కరణ్( Karan ) పైలట్ కాబట్టి అతను డ్యూటీ కోసం వెళ్లిపోవాల్సి ఉంటుందని, దాంతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అనారోగ్య సమస్యలు తన మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్నాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది . తనకొచ్చిన జబ్బు గురించి డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని, ఈ విషయంలో తనకేం చేయాలో కూడా అర్ధం కావడం లేదు అని ఆమె వెల్లడించింది. అందరూ తినే ఫుడ్ ఎందుకు తినలేకపోతున్నానో అంటూ తనను తాను ప్రశ్నించుకుంటోంది శిఖా సింగ్. గతంలో తన అనారోగ్య సమస్యల గురించి బయటకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద నగరంలో ఉంటున్నప్పుడు ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవాలని మీ దగ్గరకు రావాలని కోరుకుంటారు అని ఆమె తెలిపింది. అందుకే తాను కూడా తన సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వెల్లడించింది. తన కూతురు రోజూ తన వద్దకు వచ్చింది అమ్మా ఏమైందంటూ అడుగుతుందని, తన ముఖం చూసినప్పుడు బాధ కలుగుతుందని, తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించింది శిఖా సింగ్.

Leave a Reply