Tue. Mar 28th, 2023

తారకరత్న చేతిపై పచ్చబొట్టు.. ఆ సంతకం ఎవరిదో తెలుసా?

టుడు నందమూరి తారకరత్న మరణంతో అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న సినిమాల గురించి, ఆయన మంచితనం గురించి అభిమానులు చర్చించుకుంటుండగా ఆయన చేతిపై ఉన్న టాటూ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటో తెలుసా?

అది సింహం బొమ్మ. ఆ బొమ్మ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్‌ కూడా ఉంది. బాలయ్యపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఈ పచ్చబొట్టు వేయించుకున్నారు. తారకరత్న, బాలకృష్ణలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ అలాంటిది. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయినప్పుడు అంతా తానై చూసుకున్నారు బాలయ్య. తను కోలుకునేందుకు ఆయన చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే బెంగళూరు నారాయణ హృదయాల డాక్టర్స్‌తో మాట్లాడి తనను అక్కడకు షిఫ్ట్‌ చేయించారు. ప్రత్యేక వైద్యులను పిలిచి మరీ ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. ఆస్పత్రి బిల్లులు చెల్లిస్తూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తూ ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.