Tue. Mar 28th, 2023

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు చనిపోయారు. మృతులు మానవపాడు మండలం కొరివిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు సాయి, రఫీ, శేఖర్ లుగా గుర్తించారు.

మానవపాడు మండలం కొరివిపాడుకు చెందిన ముగ్గురు యువకులు అలంపూర్ జోగులాంబ ఆలయంలో రాత్రి జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నక్రమంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రాత్రి వేళలో జాగరణం చేసి నిద్ర మత్తులో తెల్లవారుజామున ఇంటికి చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసున నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం బొలేరో వాహనం డ్రైవరా, లేదా బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులదా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.