పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ విషయం లో ఫ్యాన్స్ కి చేదువార్త..ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వం లో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రం లో కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఈ నెల 22 వ తారీఖున ఉగాది ని పురస్కరించుకొని విడుదల చెయ్యబోతున్నట్టు గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనే లోపు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక చేదు వార్త. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈ నెల 22 వ తారీఖున విడుదల చెయ్యడం లేదట. పవన్ కళ్యాణ్ అప్పుడే ఎందుకు, సినిమా 90 శాతం పూర్తి అయినా తర్వాత విడుదల చెయ్యండి అని మూవీ టీం కి చెప్పాడట.దాంతో 22 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వాయిదా పడింది. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.
గత కొద్దీ రోజుల క్రితమే లీకైన ఈ ఫోటోలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.పవన్ కళ్యాణ్ ఎంతో స్టైలిష్ గా ఉన్న లుక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఇంత స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ కనపడి చాలా రోజులే అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతుండడం తో మూవీ టైటిల్ ‘దేవర’ అని పెట్టే ఆలోచనలో ఉందట మూవీ టీం, చూడాలి మరి.