Tue. Mar 28th, 2023

పవన్‌ కల్యాణ్‌కే మా మద్దతు.. ఆయన ఒక్క మాట చెప్తే చాలు.. శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

వైపు లు, మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఈక్రమంలో కొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అదే సమయంలో హైపర్‌ ఆది లాంటి వాళ్లు జనసేనానికి అండగా నిలుస్తున్నారు. బహిరంగంగానే పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా తన కుటుంబం మొత్తం జనసేన పార్టీకి సపోర్టుగా ఉంటామంటూ ప్రకటించారు ప్రముఖ నటుడు శివబాలాజీ. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ, మధుమిత దంపతులు మాట్లాడుతూ పవన్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా పవర్‌స్టార్‌కి పెద్ద అభిమానిని. అయితే నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ నేను ముందు నుంచి పవన్‌ సార్‌కి సపోర్ట్‌గా ఉన్నాను. ఆయన స్థాపించిన నాటి నుంచి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నాం. రాజకీయాల్లోకి రాను కానీ ఆయన ఒక్క మాట చెప్తే చాలు. జనసేన పార్టీ కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తాం. మా సోషల్‌ మీడియా ద్వారా పవన్‌ సార్ కోసం పని చేస్తాం. నూటికి నూరు శాతం ఆయన కోసం కష్టపడి పని చేస్తాం. పవన్‌ సార్‌కు ఓపిక ఎక్కువ. ఆయనకున్న క్రేజ్‌, పాపులారిటీతో లు చేసుకుంటూ కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ ఆయన ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నారు’ అని పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు శివ బాలాజీ.

కాగా పవన్‌కల్యాణ్‌తో కలిసి కాటమరాయుడు లో నటించారు శివ బాలాజీ. ఆ లో పవన్‌ సోదరుడిగా నటించి మెప్పించారాయన. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ అయిన ఆయన ప్రస్తుతం లతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించున్నారు శివబాలాజీ. అలాగే శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో సిందూరం అనే లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.