క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్..

న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టిల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ఆస్టిల్ వెల్లడించాడు.
తన ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా కాంటర్‌బరీ క్రికెట్ క్లబ్ తనకు ఎన్నో జ్ణాపకాలను అందించిందని ఆస్టిల్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇక న్యూజిలాండ్ తరపున అన్నిఫార్మాట్‌ల్లో కలిపి 19 మ్యాచ్‌లు ఆడిన ఆస్టిల్ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్టిల్‌కు జాతీయ జట్టు తరపున కాకుండా దేశీవాశీ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉంది.అతడు దేశీవాశీ క్రికెట్‌లో దాదాపు 300కి పైగా మ్యాచ్‌లు ఆడాడు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కాంటర్‌బరీ తరపున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 334 వికెట్లు పడగొట్టాడు. ఇక 36 ఏళ్ల ఆస్టిల్ తన క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఈ ఏడాది జరిగిన సూపర్ స్మాష్ ఫైనల్లో కాంటర్‌బరీ తరపున ఆడాడు. ఈ ఏడాది సూపర్ స్మాష్ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 11 వికెట్లు పడగొట్టాడు.