భర్త నే మోసం చేసిన మహాలక్ష్మి.. రవీందర్ తెలివిగా తప్పించుకున్నాడు!!

కోలీవుడ్ సెలబ్రిటీ జంట మహాలక్ష్మి , రవీందర్ ల గురించి అందరికి తెలిసిందే.
వీరి పెళ్లి ఎంతో మందిని షాక్ కి గురిచేయడం తో పాటు ఆశ్చర్య పరిచింది కూడా. ప్రేమించు పెళ్లి చేసుకున్న వీరు తమ గురించి ప్రతీదీ తమ అభిమానులతో పంచుకుంటుంటారు. ఎంతో అందంగా కనిపించే మహాలక్ష్మి కేవలం డబ్బుకోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుంది అని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిని తిప్పి కొట్టింది.
వారు కలిసి మెలసి ఉండే తీరు చూసి విమర్శించిన వారంతా నోళ్లు మూసుకునేలా చేసింది. ఏదేమైనా ఈ ఇద్దరు ఒకరినొకరు అంతగా ప్రేమించుకోవడం చాలామందికి సంతోషాన్నిస్తుంది. అయితే ఇప్పటికీ వీరి మీద ట్రోల్స్ కి అంతు ఉండడం లేదు. మరి వీళ్ళ నోళ్లు ఎలా ముస్తాయో చూడాలి.
ఇటీవలే ఈ జంట పెళ్ళై వందరోజుల సెలెబ్రేషన్స్ కూడా జరుపుకుంది. క్రిస్మస్ వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. రవీందర్ తన భార్య కోసం ఒక మంచి గిఫ్ట్ ను కానుకగా ఇవ్వగా ఇప్పుడు మహాలక్ష్మి వంతు వచ్చింది. ఆమె న్యూ ఇయర్ వేడుకలను కూడా ప్లాన్ చేసిందట.
ఆ వేడుకలో రవీందర్ ను డైరెక్ట్ గా ఆహ్వానించకుండా సర్ ప్రైజ్ చేయాలనీ భావించింది. అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే రవీందర్ ఆమెకు తెలీకుండా వారికి ఓ హాలీడే బుక్ చేశాడట. ఆ టికెట్స్ ను నేరుగా ఇంటికి పోస్ట్ వచ్చేలా చేశాడట.(Mahalakshmi-Ravindar) దాంతో భర్త తనకోసం చేసినదానిని చూసి అవాక్కయిన ఈమె అయన ప్రేమకు పొంగిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి మెలసి ఉండడం చూసి అభిమానులు అయితే తెగ సంతోషపడిపోతున్నారు.