Sat. Jun 10th, 2023

ఇది సరిపోవడం లేదా.. దసరా టీమ్ ఇంకాస్త చేయాల్సి ఉందా

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసిన సినిమా మరో ఎత్తు అనే చెప్పాలి.. ఎందుకంటే నాని మొదటిసారిగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు..

తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ”దసరా” (Dasara) సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించింది.

రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నుండి నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ అందరిని ఆకట్టు కుంటుంది.. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తెలుగులో మంచి అంచనాలు రేపాయి.. అయితే దసరా సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది.. కానీ తెలుగు, ఓవర్సీస్ మినహా మిగతా భాషల్లో పెద్దగా అంచనాలు క్రియేట్ చేసుకోలేక పోయింది.

మిగతా భాషల్లో సైతం టీమ్ ప్రమోషన్స్ చేస్తున్న పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు.. మరి రిలీజ్ కు కూడా టైం దగ్గర పడుతుండడంతో టీమ్ మిగిలిన భాషల్లో మరింత బలంగా ప్రమోషన్స్ చేయాలని భావిస్తోందట.. మరి చిత్ర యూనిట్ ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుని అంచనాలు పెంచుతుందో వేచి చూడాల్సిందే.. ఇదిలా ఉండగా సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని ధరణి పాత్ర పోషించాడు.. అలాగే కీర్తి కూడా డీ గ్లామర్ రోల్ లోనే నటించింది.. ఇక ఆది పినిశెట్టి కూడా కీలక రోల్ చేస్తుండగా ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.. కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు..

Leave a Reply