నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను చేరదీయడానికి ఆ ఒక్కటే కారణమా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) కు, నందమూరి ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ గురించి పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.
అయితే అటు బాలయ్య కానీ ఇటు ఎన్టీఆర్ కానీ ఈ విభేదాల గురించి ఘాటుగా ఎప్పుడూ స్పందించలేదు. 2009 ఎన్నికల సమయం నుంచి అరవింద సమేత సినిమా( Aravinda sametha ) రిలీజ్ వరకు బాలయ్య, తారక్ మధ్య సఖ్యత బాగానే ఉంది. అయితే నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒకింత కఠినంగానే వ్యవహరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ డమ్ ఉండటం వల్లే నందమూరి ఫ్యామిలీ ఈ విధంగా చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరికృష్ణ ( Harikrishna ) మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మొదట్లో ప్రేమగా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. క్లాస్ సినిమాలైన దిల్, భద్ర, బొమ్మరిల్లు సినిమాలలో అవకాశం వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్నారు.
నందమూరి ఫ్యామిలీకి, జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ కు పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ కు కారణమేంటనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అవసరం నందమూరి కుటుంబానికి ఎంత ఉందో నందమూరి కుటుంబం అవసరం ఎన్టీఆర్ కు అంతే ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతుండగా తారక్ కు లక్ కూడా కలిసొస్తే బాక్సాఫీస్ షేక్ కావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఆకాశమే హద్దుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహించని రేంజ్ కు ఎదుగుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.