Tue. Mar 28th, 2023

కాంటాక్ట్‌ లెన్స్‌తో పడుకుంటే కంటిని తినేసింది !

కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకొని నిద్రపోయిన ఓ వ్యక్తి తన కంటిని కోల్పోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్‌ క్రుంహోల్జ్‌(21) ఏడేండ్లుగా కాంటాక్ట్‌ లెన్స్‌ వాడుతున్నారు.
అప్పుడప్పుడు అవి తీయకుండానే నిద్రపోతుంటాడు.Contact Lenses | వాషింగ్టన్‌: కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకొని నిద్రపోయిన ఓ వ్యక్తి తన కంటిని కోల్పోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్‌ క్రుంహోల్జ్‌(21) ఏడేండ్లుగా కాంటాక్ట్‌ లెన్స్‌ వాడుతున్నారు. అప్పుడప్పుడు అవి తీయకుండానే నిద్రపోతుంటాడు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ అతడికి ఏ సమస్య రాలేదు. కానీ, ఈసారి మాత్రం ఈ అజాగ్రత్త ఆయన కంటిని కోల్పోయేలా చేసింది.

అకాంతమీబా కెరాటిటిస్‌ అనే మాంసాన్ని తినే ఓ పరాన్నజీవి అతడి కంటికి సోకింది. ఇది అతడి కుడి కంటిని క్రమంగా తినేస్తున్నది. దీంతో అతడు తన ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు. తనలా ఎవరూ కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకొని పడుకోవద్దని, స్నానం చేయవద్దని మైక్‌ కోరుతున్నారు. తన దుస్థితిని వెల్లడిస్తూ ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నారు.