Sat. Jun 10th, 2023

చూస్తే అయ్యోపాపం అనేలా ముఖాలు.. వీళ్లు చేసింది తెలిస్తే హడలే..

పైన ఫోటో చూశారు కదా.. వీరందరినీ చూస్తే చిన్న పిల్లల్లాగే ఉన్నారు. అమాయకంగా.. చూడగానే అయ్యో పాపం అని దానం చేసేలా ఉన్నారు. కానీ, వీరు చేసే పని తెలిస్తే మాత్రం బాప్‌రే అని హడలిపోతారు.

అవును, పైకి అమాయకుల్లా కనిపించే వీరు.. మహా మాయగాళ్లు. ఛాన్స్ దొరికితే చాలు అందినకాడికి దున్నేస్తారు. పాపం, పుణ్యం అనే ముచ్చటే లేదమ్మా అంటూ అందినకాడికి దోచేస్తారు. వీరి వెనుక పెద్ద ముఠానే ఉందండోయ్. అయితే, ఈ ముఠా గుట్టును రట్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు.

వారం రోజుల క్రితం ములుగు జిల్లా పరిధిలోని ఓ టౌన్‌లో పార్కింగ్ చేసిన బైక్‌ బ్యాగ్ నుంచి రూ. 3 లక్షలు చోరీ చేశారు. దానిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆ డబ్బును దొంగిలించింది మహిళలుగా గుర్తించారు. వారి ఆనవాళ్లను బట్టి.. వారిని పట్టుకునేందుకు ప్రత్యంగా గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు.

చోరీకి పాల్పడిన నలుగురు దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 2.39 లక్షల సొమ్మును రికవరీ చేశారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించింది కోర్టు.