ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాఫ్ డే స్కూల్స్, సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?

తెలంగాణలో ఇప్పటికే హాఫ్ డే స్కూల్స్, సమ్మర్ హాలీడేస్ పై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
దీంతో పొరుగు రాష్ట్రమైన ఏపీ విద్యార్థులు సైతం హాఫ్ డే స్కూల్స్, సమ్మర్ హాలీడేస్ పై అప్టేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇందుకోసం.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ లోని 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి.
అనంతరం మరో రెండు రోజుల పాటు ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఒక వేళ రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికమైతే.. ఈ సెలవులు ఇంకా కాస్త ముందు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. అనంతరం జూన్ 12 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి.
ఇంకా రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. వారికి ప్రతీ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
అనంతరం వారికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ ఆధారంగా వారికి ఇంటర్ తరగతులు ప్రారంభం అవుతాయి. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో వారికి కాలేజీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.