Tue. Mar 28th, 2023

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్‌ నిర్ణయం..

తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందాడనే ఆవేదనతో ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో నెలకొంది.

వివరాలు.. కోవిల్‌పతాగై ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌ కుమార్తె వినోదిని(22). ఈమె అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ముత్తాపుదుపేట సమీపంలోని కరిమేడు ప్రాంతానికి చెందిన వసంత్‌(23)ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వసంత్‌ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వసంత్‌ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వినోదిని శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్‌ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కైవసం చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ కీళ్‌పాక్కం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు.