Sat. Jun 10th, 2023

జిమ్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నీచుడితో ఎలా పోరాడిందో చూడండి

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జిమ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి యువతి వద్దకు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.

అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. జనవరి 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్లోరిడాలోని టంపా నగరానికి చెందిన నషాలి అల్మా అనే 24 ఏళ్ల యువతి ఫిట్‌నెస్‌ మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌. తన అపార్ట్‌మెంట్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుంది. ఆ సమయంలో అక్కడ ఆమె ఒక్కతే ఉంది. ఇంతలో ఎవరో వ్యక్తి జిమ్‌లోకి వచ్చాడు. కొద్దిసేపు ఏదో పనిచేసుకుంటున్న నటిస్తూ అనంతరం వ్యాయామం చేసుకుంటున్న యువతి వద్దకు వచ్చాడు. ఆమెను బంధించడానికి ప్రయత్నించాడు.

గట్టిగా పట్టుకొని నేలమీద పడేసి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడికి చిక్కకుండా గట్టిగానే పోరాడింది నషాలి. భయపడకుండా ధైర్యంగా అతని బారి నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యాలన్నీ జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. అలాగే ఆ నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.