తొలిసారిగా క్యూట్ బేబీ ఫోటోలు షేర్ చేసిన అలియా భట్.. ఆమె కూతురేనా?

బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో అలియాభట్- రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. గతేడాది పెళ్లిపీటలెక్కిన ఈ జోడి నవంబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తమ ముద్దుల కూతురుకు రాహా అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగే ఎక్కడ తమ బేబీ కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. రెండేళ్ల వరకు తమ బేబీని చూపించబోమని ఇప్పటికే అలియా- రణ్‌బీర్ సన్నిహితులు కూడా తెలిపారు. అందుకే సోషల్ మీడియాలోను ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. అయితే తాజాగా అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పింక్ డ్రెస్‌లో ఉన్న ఈ బేబీ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు కేవలం ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. కానీ వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలో ఉన్నది అలియా-రణ్‌బీర్ ముద్దుల కూతురేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాహా అచ్చం అలియా లాగే ఉందంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ విషయంపై అలియా భట్- రణ్‌బీర్ దంపతులు స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.
ఇక ల విషయానికొస్తే.. బ్రహ్మాస్త్ర లో జంటగా కనిపించారు అలియా- రణ్‌బీర్. ఇక తన తదుపరి లో రణవీర్ సింగ్‌తో కలిసి కనిపించనుంది అలియా. ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ కు కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర మరియు షబానా అజ్మీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ థియేటర్లలోకి రానుంది. దీతో పాటు ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’ లోనూ లీడ్‌రోల్‌లో నటించనుందీ క్యూట్ బ్యూటీ. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ కూడా స్ర్కీన్ షేర్ చేసుకోనున్నారు.